'ఆచార్య' షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన చిరంజీవి... మెగా అభిమానుల కోలాహలం

21-02-2021 Sun 13:13
  • తూర్పుగోదావరి జిల్లాలో 'ఆచార్య' తాజా షెడ్యూల్
  • రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద చిరంజీవికి ఘనస్వాగతం
  • భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు
  • కోరుకొండ వరకు ర్యాలీ
  • అభిమానుల ప్రేమకు మెగాస్టార్ ఫిదా
Megastar Chiranjeevi gets huge welcome in Rajahmundry

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వచ్చిన చిరంజీవికి అపూర్వస్వాగతం లభించింది. ఇక్కడి మధురపూడి ఎయిర్ పోర్టు ప్రాంతమంతా మెగా అభిమానులతో నిండిపోయింది.

అంతేకాదు, విమానాశ్రయం నుంచి షూటింగ్ జరుగుతున్న కోరుకొండ, మారేడుమిల్లి వరకు చిరంజీవిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. చిరంజీవిపై పూలు చల్లుతూ, నినాదాలు చేస్తూ తమ ప్రేమను చాటుకున్నారు. ఫ్యాన్స్ తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు చిరంజీవి ముగ్ధుడయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, తూర్పుగోదావరి జిల్లాలో జరిగే షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది. 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.