నేను ఇప్పుడు అలా ఆలోచించ‌డం లేదు: హీరోయిన్ ప్రియాంక చోప్రా

21-02-2021 Sun 09:40
  • సినిమాల్లో  పాత్రల ఎంపిక విషయంలో  నాలో  మార్పు
  • సినిమా వర్కౌట్‌ అవుతుందా? అని ఆలోచించ‌ట్లేదు 
  • నాకు నచ్చితే భయం లేకుండా చేస్తున్నా
my opinion changed says priyanka

సినిమాల్లో త‌న పాత్రల ఎంపిక విషయంలో తనలో గొప్ప‌ మార్పు వ‌చ్చింద‌ని హీరోయిన్ ప్రియాంక చోప్రా చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమా వర్కౌట్‌ అవుతుందో లేదో అన్న విష‌యాన్ని గురించి ఇప్పుడు తాను ఆలోచించ‌డం లేదని తెలిపింది.  పాత్రల ఎంపిక విషయంలో ఇప్పుడు తాను మునుప‌టిలాగా ఆలోచించడం మానేశానని చెప్పింది.

ఎలాంటి పాత్రయినా స‌రే త‌న‌కు నచ్చితే భయం లేకుండా చేస్తున్నానని తెలిపింది. తాను కొంతకాలంగా సినిమాల‌ను బాగా గమనించడం వల్ల త‌న‌లో ఈ మార్పు వచ్చి ఉండొచ్చ‌ని చెప్పింది. సినిమా కథ  ప్రేక్షకులకు చూపించాలనిపిస్తే  తాను న‌టిస్తాన‌ని చెప్పింది. కాగా, బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించిన విష‌యం తెలిసిందే.