Wife: భార్య సరసాన్ని తిరస్కరించిన భర్త... ఫిదా అవుతూ ఫన్నీ కామెంట్ చేసిన ఆనంద్ మహీంద్రా!

Husband Refuses Wife Kiss Video and anand Mahindra Comment
  • వీడియో కాల్ లో మాట్లాడుతున్న భర్త
  • వచ్చి ముద్దివ్వబోయిన భార్య
  • తెగ వైరల్ అవుతున్న వీడియో
గడచిన రెండు రోజులుగా ఇంటర్నెట్ లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వీడియో కాన్ఫరెన్స్ లో భర్త మాట్లాడుతుండగా, అతని భార్య వచ్చి సరదాగా సరసమాడబోయింది. తన భర్తకు ప్రేమగా ఓ ముద్దివ్వబోతే, ఆయన వద్దు అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చి, చిన్నగా విసుక్కున్నాడు. ఓ జూమ్ వీడియోలో ఈ దృశ్యం కనిపించగా, ఈ జంట నడి వయస్సులో ఉండటమే ఇది ఇంతలా వైరల్ కావడానికి కారణం. కరోనా కారణంగా ఇటువంటి వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. అయినా, దీనికి ఓ స్పెషల్ ఉంది.

యుక్త వయసును దాటి, వారి మధ్య బంధం మరింతగా బలపడి, వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్న వేళ, ఫన్నీగా వారిద్దరి మధ్యా జరిగిన రొమాన్స్ కావడంతో ప్రతిఒక్కరూ ఈ వీడియోను చూశారు. చాలా మంది ముద్దివ్వడానికి వచ్చిన భార్యను వారించకుండా ఉండాల్సిందని అంటుండగా, మరికొందరు వీడియో కాల్ నడుస్తుంటే, ఇటువంటి పనులేంటని కూడా అంటున్నారు.

ఇక, తనకు కనిపించిన ఎటువంటి ఫన్నీ వీడియోనైనా షేర్ చేసి, ఆపై కామెంట్లు పెట్టి మరింత వైరల్ చేసే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రాకు ఇది చేరింది. ఇంకేముంది... ఈ వీడియోను షేర్ చేసిన ఆయన, ఓ సరదా కామెంట్ పెట్టారు. "ఈ సంవత్సరం ఉత్తమ భార్యగా ఆమెనే నేను నామినేట్ చేస్తాను. భర్త కాస్తంత పాజిటివ్ గా స్పందించి వుంటే, ఉత్తమ జంటగా కూడా నామినేట్ చేసుండే వాడిని. కానీ ఆయన చిరాకు ప్రదర్శించి ఆ అవకాశాన్ని కోల్పోయారు" అని వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రాను ఇంతగా ఆకర్షించిన వీడియోను మీరూ చూడవచ్చు.

Wife
Kiss
Anand Mahindra
Twitter
Viral Videos

More Telugu News