ఇంగ్లండ్ తో పింక్ బాల్ టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్ల కసరత్తులు... ఫొటోలు ఇవిగో!

20-02-2021 Sat 19:46
  • ఈ నెల 24న భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు
  • మొతేరా స్టేడియంలో మ్యాచ్
  • మ్యాచ్ గెలుపుపై కన్నేసిన టీమిండియా
  • సిరీస్ లో ఆధిక్యం కోసం ఇంగ్లండ్ ప్రయత్నం
  • 17 మందితో ఇంగ్లండ్ జట్టు ప్రకటన
Team India practice for third test against England

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో రెండు మ్యాచ్ లు ముగియగా, ఇరుజట్లు 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24న అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగే మూడో టెస్టుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇది డేనైట్ టెస్టు కావడంతో పింక్ బాల్ తో ఆడనున్నారు. మొతేరా వేదికగా జరిగే మూడో టెస్టులో నెగ్గి సిరీస్ లో ఆధిక్యం అందుకోవాలని టీమిండియా శిబిరం భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ సేన తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

కాగా, ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆడే అవకాశాలు మెరుగవుతాయి. దాంతో మూడో టెస్టుపై మరింత ఆసక్తి కలుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ఇప్పటికే 17 మందితో జట్టును ప్రకటించింది.