Edappadi Palaniswami: ఎలెక్షన్ టైమ్... మెట్రో ఛార్జీలను తగ్గించిన పళనిస్వామి

Tamil Nadu CM Palaniswami announces reduction in Metro fares
  • దగ్గర పడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
  • చెన్నై ఓటర్లను ఆకట్టుకునే నిర్ణయం తీసుకున్న పళనిస్వామి
  • కనీస ఛార్జీ రూ. 10కి తగ్గింపు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల అధినేతలు తమదైన శైలిలో యత్నాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఈరోజు కీలక ప్రకటన చేశారు. చెన్నై ఓటర్లను ఆకట్టుకునేందుకు మెట్రోరైలు ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

2 కిలోమీటర్ల దూరం వరకు ఛార్జీని రూ. 10కి తగ్గించినట్టు ప్రకటనలో తెలిపారు. 2 నుంచి 5 కిలోమీటర్ల దూరానికి ఛార్జీని రూ. 20 చేశారు. 5 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఛార్జీని రూ. 30కి తగ్గించారు. 20 కిలోమీటర్ల పైన దూరానికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 22 నుంచి తగ్గిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి. క్యూఆర్ కోడ్ లేదా సీఎంఆర్ఎల్ స్మార్ట్ కార్డులను ఉపయోగించి టికెట్లు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు.
Edappadi Palaniswami
Tamil Nadu
Metro Charges

More Telugu News