మీరే నాకు అతి పెద్ద బలం: రామ్ చరణ్

20-02-2021 Sat 12:08
  • ఈరోజు చిరంజీవి దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం
  • 1980 ఫిబ్రవరి 20న చిరు, సురేఖల వివాహం
  • చిరు దంపతులకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
Ram charan wishes Chiranjeevi

తన తల్లిదండ్రులకు సినీ నటుడు రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజు చిరంజీవి, సురేఖ దంపతులు 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. తన తల్లిదండ్రులే తనకు అతిపెద్ద బలం అని ఈ సందర్బంగా చరణ్ ట్వీట్ చేశాడు. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని తెలిపాడు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. మరోవైపు ఇతర సినీ ప్రముఖులు కూడా చిరంజీవి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.