Nara Lokesh: రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజల రక్షణ దేవుడెరుగు.. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది: లోకేశ్

lokesh slams ysrcp
  • ఎస్ఐ శివశంకర్ గారిపై వైకాపా గూండాలు విచక్షణారహితంగా దాడి
  • ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను
  • ఈ రాష్ట్రంలో సామాన్యులు ఎలా బ్రతకాలి?
వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  పోలీసులకు కూడా రక్షణ లేకుండాపోయింద‌ని టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించా‌రు. ఇక సామాన్య ప్ర‌జ‌లు ఎలా బ‌త‌కాల‌ని ఆయ‌న నిల‌దీశారు.
 
'రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజల రక్షణ దేవుడెరుగు.. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం, గ్రిద్దలూరు గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శివశంకర్ గారి పై వైకాపా గూండాలు విచక్షణారహితంగా దాడి చెయ్యడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను' అని ఆయ‌న చెప్పారు.

'శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు ఎలా బ్రతకాలి?ఎస్ఐ శివశంకర్ గారి పై దాడి చేసిన వైకాపా రౌడీలను కఠినంగా శిక్షించాలి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.


Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News