Narendra Modi: మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి సమావేశం.. పాల్గొన్న కేసీఆర్, జ‌గ‌న్

  • వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మావేశం
  • మ‌మ‌తా బెన‌ర్జీ, అమ‌రీంద‌ర్ సింగ్‌ గైర్హాజరు
  • వ్యవసాయం, మౌలిక సదుపాయాలపై చ‌ర్చ
niti aayog conference begins

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి సమావేశం వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభ‌మైంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ స‌హా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, సీఈఓ అమితాబ్‌కాంత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌, పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ దీనికి గైరుహాజరయ్యారు.

ఈ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉత్పాదక రంగం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం వంటి వివిధ అంశాలను చ‌ర్చిస్తున్నారు. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా పాల‌క మండ‌లి సమావేశం జ‌ర‌గ‌లేదు. చివ‌రిసారిగా 2019 జూన్ లో ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

More Telugu News