సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

20-02-2021 Sat 07:23
  • మరో తమిళ సినిమాలో తమన్నా 
  • పవన్, పూరి కాంబోలో ప్రాజక్ట్
  • నాని రెండు సినిమాల అప్ డేట్  
Thamanna opposite Dhanush in a Tamil movie

*  అందాలతార తమన్నా తమిళంలో మరో సినిమా చేయనుంది. ధనుష్ హీరోగా అతని సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా తమన్నా నటించే అవకాశం వుంది. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మే నెల నుంచి షూటింగ్ జరుగుతుంది.
*  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పూరి జగన్నాథ్ ల కలయికలో మరో సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఈ కాంబినేషన్ లో చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  
*  నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రెండు చిత్రాలు ఇప్పుడు నిర్మాణంలో వున్నాయి. వాటిలో 'టక్ జగదీశ్' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. 'శ్యామ్ సింగరాయ్' సెట్స్ పై వుంది. ఈ రెండు చిత్రాల ఫస్ట్ లుక్ లను ఈ నెల 24న నాని జన్మదినం సందర్భంగా విడుదల చేయనున్నారు.