Britain: ఈ మనుషులతో నా వల్ల కాదు కానీ జైల్లో పెట్టండి.. పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి

wanted man turns himself in says he is fed up of living with people
  • లాక్‌డౌన్ సమయంలో నాలుగు గోడల మధ్యే గడిపిన నిందితుడు
  • తన చుట్టూ ఉన్న వారితో జీవించలేకపోతున్నానని ఆవేదన
  • జైలులోనే ప్రశాంతంగా ఉంటుందని భావన
ఈ జనాల మధ్య ఉండడం తన వల్ల కాదని, తనను జైలులో పెట్టాలంటూ పరారీలో ఉన్న ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన బ్రిటన్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పరారీలో ఉన్న ఓ వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా నాలుగు గోడల మధ్యే గడిపేశాడు.

ప్రస్తుతం తాను జీవిస్తున్న మనుషుల తీరుతో విసిగిపోయిన అతగాడు ఇక్కడ కంటే జైలులో ఉండడమే బెటరని, అక్కడైతేనే ప్రశాంతంగా ఉంటుందని భావించాడు. ఆలస్యం చేయకుండా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. డారెన్ టేలర్ అనే పోలీసు అధికారి ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లొంగిపోయిన అతడిని జైలుకు తరలించినట్టు పేర్కొన్నారు.
Britain
Jail
Police

More Telugu News