ప్రభుత్వ అధికారులకు విద్యుత్ వాహనాలను అందిస్తాం: గడ్కరీ
- 10 వేల విద్యుత్ వాహనాలను వాడితే నెలకు రూ. 30 కోట్లు ఆదా అవుతుంది
- తొలుత మా శాఖలోనే విద్యుత్ వాహనాలను వినియోగిస్తాం
- ఢిల్లీ నుంచి ఆగ్రా, జైపూర్ లకు విద్యుత్ బస్ సర్వీసులను ప్రారంభిస్తాం
ఢిల్లీ నుంచి ఆగ్రా, జైపూర్ లకు త్వరలోనే విద్యుత్ బస్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు గడ్కరీ తెలిపారు. అంతేకాదు... వంట గ్యాస్ కు ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నట్టుగానే.. విద్యుత్ తో పని చేసే వంట పరికరాలకు సబ్సిడీ ఇవ్వడం కూడా సముచితమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు గ్యాస్ పై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు.