సోము వీర్రాజుపై కొడాలి నాని సెటైర్లు

19-02-2021 Fri 18:03
  • స్టీల్ ప్లాంటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై వీర్రాజు వ్యాఖ్యలు హాస్యాస్పదం
  • ఆయన మాటలను ఆ పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోరు
  • ప్రైవేటుపరం చేయడం లేదని కేంద్రంతో ఒక ప్రకటన ఇప్పించాలి
Kodali Nani satires on Somu Veerraju

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి సోము వీర్రాజు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయించడం లేదని కేంద్ర ప్రభుత్వంతో సోము వీర్రాజు ఒక్క స్టేట్మెంట్ ఇప్పించాలని అన్నారు. తమ మీద ఆరోపణలు చేయడాన్ని వీర్రాజు ఆపేయాలని చెప్పారు. సోము వీర్రాజు చెప్పే మాటలను ఆ పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోరని ఎద్దేవా చేశారు.

అంతకు ముందు సోము వీర్రాజు మాట్లాడుతూ ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ, టీడీపీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీతో చేతులు కలిపి బీజేపీని ఏకాకిని చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఒక ప్రకటన కూడా చేయలేదని... అలాంటప్పుడు ఉద్యమం ఎందుకని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు వ్యాఖ్యలపై కొడాలి నాని మండిపడ్డారు.