Chandrababu: కె.విశ్వనాథ్ సినిమాల ద్వారా మన సంస్కృతి, కళల ప్రాముఖ్యాన్ని కొత్త తరాలకు తెలియజెప్పారు: చంద్రబాబు

Chandrababu and Lokesh wishes K Viswanath on his birthday
  • నేడు కె.విశ్వనాథ్ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు, లోకేశ్
  • నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్ష
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు, 'కళాతపస్వి' కె.విశ్వనాథ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు సినీ 'కళాతపస్వి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు, కళల ప్రాముఖ్యతను కొత్తతరాలకు తెలియజెప్పారని కె.విశ్వనాథ్ ను కొనియాడారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని వెల్లడించారు.

అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కె.విశ్వనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేక్షకుల వినోదం కోసం తీసే సినిమాల ద్వారా కూడా సంస్కృతిని, సంప్రదాయ విలువలను కాపాడే సామాజిక బాధ్యతను నెరవేర్చవచ్చని నిరూపించారని కితాబునిచ్చారు. నిండైన ఆరోగ్యంతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Chandrababu
Nara Lokesh
K.Viswanath
Birthday
Tollywood

More Telugu News