నవదంపతులకు ఐదు లీటర్ల పెట్రోలు, గ్యాస్ బండ బహుమతి.. మెడలో ఉల్లిపాయల దండ!

19-02-2021 Fri 09:47
  • చెన్నైలో ఘటన
  • దేశంలో మండిపోతున్న పెట్రోలు, గ్యాస్ ధరలు
  • సోషల్ మీడియాలో వైరల్
Friends gift petrol and gas cylinder for newly wedding couple

పెట్రోలు, గ్యాస్ ధరలు కొండెక్కుతున్న వేళ ఓ కొత్త జంటకు ఆ రెండింటిని బహుమానంగా ఇచ్చారు వారి స్నేహితులు. చెన్నైలో జరిగిందీ ఘటన. నగరానికి చెందిన కార్తీక్, శరణ్యల వివాహం వంగరంలోని ఓ కల్యాణ మండపంలో ఘనంగా జరిగింది. పెళ్లికి హాజరైన వరుడి తరపు స్నేహితులు ఐదు లీటర్ల పెట్రోలు, గ్యాస్ బండను కొత్త జంటకు బహుమతిగా ఇచ్చారు. అలాగే, ఉల్లిపాయలతో చేసిన దండను వారి మెడలో వేశారు.

ఇటీవల పెళ్లిళ్లలో తరచూ ఇలాంటి వినూత్న బహుమతులు ఇవ్వడం జరుగుతోంది. ఆయా కాలాల్లో రేట్లు విపరీతంగా పెరిగి సామాన్యులకు గుదిబండగా మారిన వాటిని పెళ్లిళ్లలో ఇవ్వడం ఇటీవల కొంత పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. గ్యాస్ ధర గురించి ఇక చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటి వాడైన తమ స్నేహితుడికి మిత్రులు ఇలా పెట్రోలు, గ్యాస్ సిలిండర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.