Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
  • కొత్త‌గా 165 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,278
  • మృతుల సంఖ్య 1,623
  • కొత్త‌గా 35 క‌రోనా కేసుల న‌మోదు 
తెలంగాణలో కొత్త‌గా 165 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 149 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,278 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,940 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,623 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,715 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 681 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 35 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

Corona Virus
COVID19
Telangana

More Telugu News