తుప్పు నాయుడి పార్టీ కొట్టుకుపోవడం ఖాయం: విజయసాయిరెడ్డి

18-02-2021 Thu 20:21
  • కుప్పంలో టీడీపీ కుశాలు కదిపేశారు
  • మూడో విడతలో చంద్రబాబును జనాలు మడత పెట్టేశారు
  • చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు
Chandrababu party has no future says Vijayasai Reddy

పంచాయతీ ఎన్నికల మూడో విడతలో కూడా చంద్రబాబును జనం మడత పెట్టేశారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. కుప్పంలో టీడీపీ కుశాలు కదిపేశారని చెప్పారు. పచ్చ పార్టీ భవిష్యత్తు ఏంటో కుప్పంని చూస్తే అర్థం అవుతుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో తుప్పు నాయుడు పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని ట్వీట్ చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కార్మిక లోకానికి జగన్ గారి భరోసా కొండంత ధైర్యాన్నిచ్చిందని అన్నారు. కేంద్రం నిర్ణయంలో మార్పులేకపోతే అసెంబ్లీలో తీర్మానానికి జగన్ గారి సర్కార్ వెనుకాడదని చెప్పారు. విశాఖ ఉక్కు మీకు దక్కదంటూ చంద్రబాబు భయపెడితే, జగన్ గారు భరోసా ఇచ్చారని... వైసీపీవి ఉక్కురాజకీయాలైతే, టీడీపీవి తుక్కు రాజకీయాలని అన్నారు.

85 శాతానికి పైగా పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారని విజయసాయి చెప్పారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు మాత్రం క్లారిటీతో ఉన్నారని అన్నారు. పచ్చ మీడియా జాకీలేసి లేపినా... ప్రజలు మాత్రం నిన్ను నమ్మం బాబూ అని అంటున్నారని ఎద్దేవా చేశారు. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో తుప్పు నాయుడుకు చరమగీతమేనని అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీకి జనమే ఆక్సిజన్ పీకేస్తారని చెప్పారు. 'పేదలకు ఇళ్లు, అమ్మ ఒడి ఆపడానికి కూడా కోర్టుల్లో పిల్స్ వేయించిన నీచుడవు నువ్వు కాదా కుట్రల నాయుడూ?' అని ప్రశ్నించారు. 'ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలతో నీ నవరంధ్రాలు మూతపడ్డాయి చంద్రబాబూ' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.