Jagan: పరమవీరచక్ర, అశోకచక్ర అవార్డు గ్రహీతల రివార్డు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటికి పెంపు: సీఎం జగన్ ప్రకటన

CM Jagan announces huge hike in rewards for gallantry award winners
  • తిరుపతిలో 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' కార్యక్రమం
  • భారత్-పాక్ యుద్ధానికి 50 ఏళ్లయిన సందర్భంగా కార్యక్రమం
  • హాజరైన సీఎం జగన్
  • వీరసైనికులపై వరాల జల్లు
  • రివార్డులు భారీగా పెంపు
బంగ్లాదేశ్ విమోచన యుద్ధానికి 50 ఏళ్లయిన సందర్భంగా తిరుపతిలో భారత సైన్యం నిర్వహిస్తున్న 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్యంలో విశిష్ట పురస్కారాలు పొందిన వీరసైనికులకు రివార్డులను పెంచుతున్నట్టు ప్రకటించారు. పరమవీరచక్ర, అశోకచక్ర అవార్డు గ్రహీతలకు అందించే రివార్డును రూ.10 లక్షల నుంచి రూ.1 కోటికి పెంచుతున్నట్టు వెల్లడించారు.

మహావీరచక్ర, కీర్తిచక్ర అవార్డు పొందినవారి రివార్డును రూ.80 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారం పొందిన వారికి ఇచ్చే రివార్డును రూ.60 లక్షలకు పెంచుతున్నామని వివరించారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ఇప్పటికే రూ.50 లక్షలు ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
Jagan
Reward
Hike
Gallantry Award Winners
Andhra Pradesh

More Telugu News