అజహరుద్దీన్ తో కలిసి క్రికెట్ ఆడిన హరీశ్ రావు... ఫొటోలు ఇవిగో!

18-02-2021 Thu 17:02
  • సిద్ధిపేటలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ పోటీలు
  • ఫైనల్స్ కు విచ్చేసిన మహ్మద్ అజహరుద్దీన్
  • అజ్జూతో కలిసి బ్యాటింగ్ చేసిన హరీశ్ రావు
  • అభిమానులను అలరిస్తున్న ఫొటోలు
Minister Harish Rao plays cricket along with former Indian skipper Mohammed Azharuddin

మంత్రి హరీశ్ రావుకు క్రికెట్ పై ఉన్న ఆసక్తి తెలిసిందే. తన నియోజకవర్గం పరిధిలో అనేక క్రికెట్ టోర్నీలను ప్రారంభించే సమయంలో తాను కూడా బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఆస్వాదిస్తుంటారు. తాజాగా, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తో కలిసి బ్యాటింగ్ చేశారు.

 సిద్ధిపేటలో జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా అజహరుద్దీన్ విచ్చేశారు. ఈ సందర్భంగా అజర్ ఓ ఎండ్ లో బ్యాటింగ్ చేయగా, హరీశ్ రావు మరో ఎండ్ లో బ్యాటింగ్ చేశారు. అంతేకాదు, తన బౌలింగ్ పాటవాన్ని కూడా హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను హరీశ్ రావు స్వయంగా పంచుకున్నారు. వీటికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.