Ram: కొత్త సినిమా ప్రకటించిన హీరో రామ్!

Hero Ram announces his next movie
  • ఇటీవల 'రెడ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్
  • లింగుస్వామితో చేస్తున్నానంటూ రామ్ ప్రకటన
  • 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలతో లింగుస్వామికి పేరు  
ఇటీవల 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ తన తదుపరి సినిమా విషయంలో తాజాగా అభిమానులకు అప్ డేట్ ఇచ్చాడు. తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. 'పందెం కోడి', 'ఆవారా' వంటి డబ్బింగ్ హిట్ చిత్రాల ద్వారా లింగుస్వామి తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితుడు.

"నేను నటించే 19వ చిత్రానికి నా అభిమాన దర్శకులలో ఒకరైన లింగుస్వామి సర్ దర్శకత్వం వహిస్తారు. అలాగే, సినిమాల పట్ల ఎంతో ఫ్యాషన్ గల నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారితో పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను' అంటూ హీరో రామ్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.

 తమిళంలో మంచి మార్కెట్ వున్న దర్శకుడు లింగుస్వామి తెలుగు హీరోతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. అది ఇప్పటికి రామ్ ద్వారా కార్యరూపం దాలుస్తోంది.
Ram
Linguswamy
Pandem Kodi
Awara

More Telugu News