Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మైలాపూర్ నుంచి కమల్, చేపాక్‌-ట్రిప్లికేన్‌ నుంచి ఖుష్బూ బరిలోకి?

Tamilnadu assembly elections kamal haasan to contest from mylapur
  • నియోజకవర్గాలపై దృష్టిసారించిన నేతలు
  • గత లోక్‌సభ ఎన్నికల్లో మైలాపూర్‌లో కమల్ పార్టీకి అత్యధిక ఓట్లు
  • ఆర్కే నగర్ నుంచి సినీ నటి వింధ్య
అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న తమిళనాడులో రాజకీయ వేడి మొదలైంది. పోటీలో దిగబోతున్న నేతలు అప్పుడే నియోజకవర్గాలను ఎంచుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన మక్కల్ నీది మయ్యం చీఫ్ కమలహాసన్ చెన్నై పరిధిలోని మైలాపూర్ నుంచి బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.

అలాగే, ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఖుష్బూ చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఇదే నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక, అన్నాడీఎంకే నేత, ప్రముఖ సినీ నీటి వింధ్య చెన్నై నుంచే పోటీ చేయాలని యోచిస్తున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో మైలాపూర్ నియోజకవర్గంలో కమల్ పార్టీకి అత్యధిక ఓట్లు లభించడంతోనే కమల్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేత టీవీవీ దినకరన్ విజయం సాధించిన అర్కేనగర్ నియోజకవర్గం నుంచి వింధ్యను బరిలోకి దింపాలని అన్నాడీఎంకే నిర్ణయించినట్టు సమాచారం. ప్రతిపక్ష డీఎంకే కూడా ఇదే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది.
Tamil Nadu
Assembly Elections
Kamal Haasan
Actress Vindhya
Kushboo

More Telugu News