కువైట్‌లో గతేడాది 1,279 మంది భారతీయుల మృతి: దౌత్యవేత్త సీబీ జార్జ్ వెల్లడి
- 334 మంది కరోనాతో కన్నుమూత
- 2019తో పోలిస్తే 572 అధిక మరణాలు
- ఈ ఏడాది ఇప్పటికే 101 మంది మృత్యువాత
కువైట్‌లోని భారత దౌత్యకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ గణాంకాలను వెల్లడించారు. మెడికల్ ఎస్కార్ట్ అవసరమైన ప్రతి ఒక్క భారతీయుడికి ప్రయాణ ఏర్పాట్లను ఎంబసీ చేస్తుందన్నారు. అలాగే, వందేభారత్ మిషన్‌లో భాగంగా కువైట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షలమంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు చెప్పిన జార్జ్.. వివిధ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు అండగా నిలుస్తామన్నారు.