కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వానిది అతి విశ్వాసం: రాహుల్​ గాంధీ

17-02-2021 Wed 14:38
  • కొత్త రకాల కరోనా కేసులపై మండిపాటు
  • నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆగ్రహం
  • కరోనా ఇంకా పూర్తిగా పోలేదని వెల్లడి
Government Overconfident Rahul Gandhi As 2 More Covid Strains Reported

కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇప్పటికే బ్రిటన్ రకం కరోనా దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా కూడా దేశంలోకి ప్రవేశించినట్టు కేంద్రం ప్రకటించింది. బ్రెజిల్ రకం కరోనా కేసు ఒకటి, దక్షిణాఫ్రికా రకం కరోనా కేసులు 4 నమోదైనట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రకటించారు.

దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ అతి విశ్వాసమే నష్టాన్ని కలిగించిందన్నారు. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటిదాకా బ్రిటన్ రకం కరోనా కేసులు 187 నమోదయ్యాయి.