Nara Lokesh: ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎందుకంత భయం?: నారా లోకేశ్

Nara Lokesh fires  on Jagan
  • ప్రజాస్వామ్యాన్ని జగన్ స్వామ్యంగా మార్చేశారు
  • వైసీపీ నేతల హింసతో దంపతులు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు
  • వైసీపీ అరాచకాలకు ఎస్ఈసీ అడ్డుకట్ట వేయాలి  
ముఖ్యమంత్రి జగన్ ప్రజాస్వామ్యాన్ని జగన్ స్వామ్యంగా మార్చేశారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. జనాన్ని ఓటు వేయనివ్వడం లేదని విమర్శించారు. ఓటేసే వాళ్లపై వేటేసే కేటుగాడు జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి మద్దతుగా నిలిచారనే కక్షతో తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ నేతలు, వాలంటీర్ పెట్టిన హింసతో దంపతులు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని... ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచకాలకు ఎస్ఈసీ అడ్డుకట్ట వేయాలని అన్నారు.

151 సీట్లను గెలుచుకుని, సంతలో పశువులను కొన్నట్టుగా మరో నలుగురిని కలుపుకున్నా ఎన్నికల్లో పోటీకి ఎందుకు భయపడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. 'తాడేపల్లి కొంపలోంచి బయటకు రావాలంటే వలలు, పోలీసులు అడ్డం ఉండాలి నీకు. మళ్లీ ఢిల్లీని ఢీకొడతాడు, మోదీ మెడలు వంచుతాడు, గాంధీ మళ్లీ పుట్టాడంటూ ఎలివేషన్లు' అని దుయ్యబట్టారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News