ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో దశ పోలింగ్
- మూడు జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో దాఖలు కాని నామినేషన్లు
- 579 పంచాయతీల్లో సర్పంచ్ పదవి ఏకగ్రీవం
- ఓటు హక్కును వినియోగించుకోనున్న 55,75,004 మంది
ఈ దశలో మొత్తం 3,221 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 579 ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో మొత్తం 55,75,004 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.