నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో కొత్త చిత్రం ప్రారంభం

16-02-2021 Tue 14:32
  • హైదరాబాదులో పూజా కార్యక్రమాలు
  • క్లాప్ కొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్
  • నాగ్ ను కొత్తగా చూపించనున్న ప్రవీణ్ సత్తారు
  • త్వరలో ఇతర తారాగణం వెల్లడి
  • మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
Nagarjuna new movie starts in HYderabad

టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున నటించే మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. గరుడవేగ చిత్రంతో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు. హైదరాబాదులో ఇవాళ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శరత్ మరార్ కు చెందిన నార్త్ స్టార్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇతర తారాగణాన్ని త్వరలో ప్రకటించనున్నారు.

నాగార్జున లాక్ డౌన్ ముగిశాక తన చిత్రాల స్పీడు పెంచారు. వైల్డ్ డాగ్, బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తి చేసుకున్నారు. కాగా, తాజా చిత్రంలో నాగ్ ను వినూత్నంగా చూపించేందుకు ప్రవీణ్ సత్తారు చాలా హోంవర్క్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పక్కాగా స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి కావడంతో, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.