Nama Ojha: కన్నీటితో రిటైర్మెంట్ ప్రకటించిన నామన్ ఓఝా

  • ఇండియా తరపున మూడు ఫార్మాట్లలో ఆడిన ఓఝా
  • ఆట నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్య
  • ఎంపీ క్రికెట్ బోర్డుకు, బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపిన ఓఝా
Cricketer Naman Ojha announces retirement

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ నామన్ ఓఝా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు, దేశవాళీ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పాడు. తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తూ ఓఝా కంటతడి పెట్టుకున్నాడు. ఇండియా తరపున మూడు ఫార్మాట్లలో ఓఝా ఆడాడు.

ఈ సందర్భంగా ఓఝా మాట్లాడుతూ, జూనియర్ కాంపిటీషన్లతో పాటు దాదాపు 20 ఏళ్లు క్రికెట్ ఆడానని చెప్పాడు. ఆట నుంచి తప్పుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని అన్నాడు. ఇది తన జీవితంలో ఒక సుదీర్ఘమైన దశ అని చెప్పాడు. తన కెరీర్ కు అండగా నిలిచిన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నాడు. దేశం కోసం ఆడాలనే తన కలను నెరవేర్చుకోవడానికి తనకు మద్దతుగా నిలిచిన కోచ్ లు, సెలక్టర్లు, ఫిజియోలు, కెప్టెన్లు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.

More Telugu News