Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. తొలిసారి 52 వేల మార్కును దాటిన సెన్సెక్స్

  • 610 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 151 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా లాభపడ్డ యాక్సిస్ బ్యాంక్
Sensex closes above 52K

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 52 వేల మార్కును దాటింది. ఈ రోజు ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 610 పాయింట్లు లాభపడి 52,154కి చేరుకుంది. నిఫ్టీ 151 పాయింట్లు పుంజుకుని 15,315 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ సూచీ 3.25 శాతం, ఫైనాన్స్ 2.66 శాతం, రియాల్టీ 1.53 శాతం పెరిగాయి.    

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

యాక్సిస్ బ్యాంక్ (6.22%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.12%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.02%), బజాజ్ ఫైనాన్స్ (3.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.11%).

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.79%), టీసీఎస్ (-1.29%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), ఏసియన్ పెయింట్స్ (-0.90%), టెక్ మహీంద్రా (-0.78%).

More Telugu News