సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

15-02-2021 Mon 07:33
  • మరో వెబ్ సీరీస్ చేస్తున్న కాజల్ 
  • నాగార్జున 'వైల్డ్ డాగ్' రిలీజ్ డేట్
  • గోపీచంద్ చిత్రంలో ఈషా రెబ్బా
  • శ్రీవిష్ణు చిత్రానికి వెరైటీ టైటిల్  
Kajal in another web series

*  కథానాయిక కాజల్ అటు సినిమాలలో నటిస్తూనే.. ఇటు వెబ్ సీరీస్ కూడా చేస్తోంది. ఇప్పటికే 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సీరీస్ లో నటించిన ఈ చిన్నది తాజాగా మరో సీరీస్ ఒప్పుకుంది. మారుతి దర్శకత్వంలో రూపొందే 'త్రీ రోజెస్' అనే వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.
*  ప్రముఖ నటుడు నాగార్జున హీరోగా రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' చిత్రాన్ని ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. అశిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
*  గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కే తాజా చిత్రానికి 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఇందులో ప్రధాన కథానాయికగా రాశిఖన్నా నటిస్తోంది. మరో కథానాయికగా ఈషా రెబ్బా నటించనున్నట్టు తెలుస్తోంది.
*  యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రానికి 'అర్జున ఫల్గుణ' అనే వెరైటీ టైటిల్ని నిర్ణయించారు. మేటనీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహిస్తుండగా.. చెన్నై బ్యూటీ అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది.