K Kavitha: టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవ ఎన్నిక

MLC K Kavitha elected as honorary president to TBGKS
  • అధ్యక్షుడిగా బి. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి
  • చర్చల అనంతరం పూర్తిస్థాయి కమిటీ ప్రకటన
  • కార్యక్రమానికి హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా టీఆర్ఎస్ అగ్రనేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగరేణిలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌కు అధ్యక్షుడిగా బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి మరోమారు ఎన్నికయ్యారు.

నిన్న శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి ఆఫీసర్స్ క్లబ్‌లో కంపెనీ స్థాయి యూనియన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. అనంతరం ఎన్నికలు నిర్వహించారు. చర్చల అనంతరం పూర్తిస్థాయి కమిటీని ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.
K Kavitha
TBGKS
Singareni

More Telugu News