Vijay Sai Reddy: రెండో విడతలో అంతకుమించి విజయదుందుభి మోగింది: విజయసాయిరెడ్డి

Vijaysai Reddy responds on second phase panchayat election results
  • ఏపీలో ముగిసిన రెండో విడత పోలింగ్
  • వెలువడుతున్న ఫలితాలు
  • ఫలితాల సరళిపై విజయసాయిరెడ్డి హర్షం
  • తొలి విడతలో 82 శాతం గెలిచామని వెల్లడి
  • టీడీపీకి కనీసం 10 శాతం ఓట్లు కూడా రాలేదని వ్యాఖ్యలు
ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. దీనిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. తొలి విడతలో 82 శాతం పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారని, రెండో విడతలో అంతకుమించి విజయదుందుభి మోగిందని పేర్కొన్నారు. జగన్ సంక్షేమ పాలనకు పంచాయతీలు పట్టం కడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పల్లెల్లో 10 శాతం ఓట్లు కూడా రాని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోందని, ఇక ప్రతిపక్ష హోదా కూడా బాబుకు గల్లంతేనని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Vijay Sai Reddy
Results
Gram Panchayat Elections
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News