KODAL: కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ ఘన విజయం

TDP candidates grand victory in Kodali Nanis native place
  • కొడాలి నాని సొంతూరు యలమర్రులో టీడీపీ విజయం
  • 271 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన కొల్లూరి అనూష
  • ఆనందంలో మునిగిపోయిన టీడీపీ శ్రేణులు
ముఖ్యమంత్రి జగన్ కు వీర విధేయుడిగా పేరుగాంచిన మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా యలమర్రులో వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి ఓటమిపాలయ్యారు. టీడీపీ మద్దతు పలికిన వ్యక్తి ఘన విజయం సాధించారు.

వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థిపై కొల్లూరి అనూష 271 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. యలమర్రులో 12 వార్డులకు గాను 11 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. నిమ్మకూరు సర్పంచ్ పదవిని కూడా టీడీపీ గెలుచుకుంది. నిమ్మకూరులో 10 వార్డులకు గాను 8 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది.

ఈ ఫలితంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. అనూషకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫలితంపై కొడాలి ఏ విధంగా స్పందిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
KODAL
Native Place
Telugudesam
YSRCP
Gram Panchayat Elections

More Telugu News