Raghu Rama Krishna Raju: చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వ టెండర్లా? అని మోదీ ఆశ్చర్యపోయారు: రఘురామకృష్ణరాజు

Modi shocked after knowing AP govt tenders for Churches construction says Raghu Rama Krishna Raju
  • ఈరోజు మోదీని కలిసిన రఘురాజు
  • చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందని మోదీకి చెప్పిన రఘురాజు
  • పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రధాని అడిగారన్న రఘురాజు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రధాని దృష్టికి ఆయన తీసుకెళ్లారు. రాజధాని అమరావతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, దేవాలయాలపై దాడులు, మత మార్పిడులు తదితర అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు మీడియాతో మాట్లాడుతూ రఘురాజు తెలిపారు.

తాను చెప్పిన అన్ని విషయాలను సావధానంగా విన్న మోదీ... ఒక విషయంలో మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. ఏపీలో చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచిందని చెప్పగానే ప్రధాని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని అన్నారు. చర్చిల నిర్మాణానికి టెండర్లా? అని ప్రశ్నించారని చెప్పారు. ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని అన్నారని తెలిపారు. టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వమని అడిగారని చెప్పారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Narendra Modi
BJP
Churches
Tenders
Andhra Pradesh

More Telugu News