Vijayashanti: తెరాసకు మరో డోసు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: విజ‌య‌శాంతి

vijaya shanti slams kcr
  • ఇటీవ‌ల‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట‌లు
  • ఇప్పుడు హాలియా స‌భ‌లో అనుచిత వ్యాఖ్య‌లు
  • కనీస రాజకీయ సంస్కారం కూడా లేదు
  • ఇది నిజాం పాలన, రాజుల కాలం కాదు
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో  హాలియా సభలో కేసీఆర్ ప్ర‌జ‌లను అవ‌మాన‌ప‌ర్చేలా వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపించారు.

'జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు జరిగిన ప్రచార సభల్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి సాక్షాత్తూ సీఎం అత్యంత అసభ్యకరంగా మాట్లాడటం ప్రజలు చూశారు. ఇటీవల జరిగిన హాలియా సభలో బాధిత మహిళలను కుక్కలు అనడం చూశాము' అని విజ‌య శాంతి అన్నారు.
 
'గతంలో ఎన్నోసార్లు అనేకమంది నాయకులు, పార్టీలను, ప్రజలను అవమానకరంగా దుర్భాషలాడటం చూశాము. ఇప్పుడు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లకు భాష, ప్రవర్తన, నియమావళి గురించి అదే ముఖ్యమంత్రి గారు చెబితే వినవలసి రావడం విడ్డూరం'
అని విమ‌ర్శించారు.
 
'కనీస రాజకీయ సంస్కారం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే ఈ సీఎం గారిని ఒక్క మాట ఎదిరించి అనరాదని టీఆరెస్ పార్టీ మంత్రులు, ముఖ్యనేతలు ఇయ్యాల అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు' అని విజ‌య శాంతి అన్నారు.
 
'ఇది నిజాం పాలన, రాజుల కాలం కాదు... ప్రజాస్వామ్యం. ఏది ఏమైనా కరోనా రెండో డోసుకు ఆరోగ్యశాఖ సిద్ధమవుతున్నట్లే... తెరాసకు దుబ్బాక, జీహెచ్ఎంసీ తీరున మరో డోసు ఇయ్యనీకి రానున్న ఎమ్మెల్సీ, సాగర్, కార్పోరేషన్‌ల ఎన్నికల కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు' అని విమ‌ర్శించారు.
 
'ఒకనాడు తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఇయ్యాల తెలంగాణ ప్రజలనే కుక్కలు అనబడితే... అందుకు పరిష్కారమేంటో ప్రజలకు తెల్వదా?' అని విజ‌య శాంతి అన్నారు.
Vijayashanti
BJP
KCR
TRS

More Telugu News