Chandrababu: ఏపీ ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన‌ చంద్ర‌బాబు

chandrababu writer letter to sec
  • కుప్పంలో టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు
  • వైసీపీ అక్రమాలకు పాల్ప‌డుతోంది
  • పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు
ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఓ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో త‌మ పార్టీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని, మిట్టపల్లి గ్రామ పంచాయతీ వైసీపీ  అక్రమాలకు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు.

త‌మ పార్టీ అభ్యర్థి శివలక్ష్మి భర్త మంజునాథపై అక్రమ కేసు నమోదు చేశారని వివ‌రించారు. మ‌రో టీడీపీ నాయకుడు మనోహర్ పై కూడా ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు పెట్టార‌ని చెప్పారు. కేసులు పెట్ట‌డంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నార‌ని వివ‌రించారు.

త‌మ పార్టీ నేత‌ల‌పై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహ‌రించేలా చేయాల‌ని చెప్పారు. అలాగే, మనోహర్‌కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని కోరారు. కుప్పంలో కూడా వైసీపీ నేత‌లు గందర‌గోళం నెల‌కొల్పుతున్నార‌ని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Chandrababu
Telugudesam
Local Body Polls

More Telugu News