Hyderabad: భయపెట్టే శబ్దాలు వచ్చే సైలెన్సర్లు వాడితే ఇక కేసులే.. వాహనదారులకు సజ్జనార్ వార్నింగ్

  • వింత శబ్దాలతో తోటి వాహనదారులను భయపెడుతున్న ఆకతాయిలు
  • డబ్బు ఆశతో సైలెన్సర్లు బిగిస్తున్న మెకానిక్‌లు
  • క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక
Cyberabad CP Sajjanar warns about silencers

వింతశబ్దాలతో తోటి వాహనదారులను భయపెట్టేలా సైలెన్సర్లను అమరుస్తున్న ఆకతాయిలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీటిని తొలగించాలని ఆదేశించారు. భయంకరమైన, వింత శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చి తోటి వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

అంతేకాదు, డబ్బు ఆశతో ఇలాంటి సైలెన్సర్లు అమరుస్తున్న మెకానిక్‌లపైనా చర్యలు తప్పవన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైలెన్సర్లు వాడేది కాలుష్యాన్ని తగ్గించడానికనీ, దానిని పెంచేందుకు కాదని పేర్కొన్నారు. ఈ మేరకు సైలెన్సర్లపై అవగాహన పెంచేందుకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.

More Telugu News