G. Kishan Reddy: తెలంగాణను వ్యతిరేకించిన వారితో పొత్తా?: కిషన్ రెడ్డి

union minister kishan reddy fires on trs
  • మేయర్ ఎన్నికతో మా ఆరోపణలు నిజమయ్యాయి
  • కేసీఆర్, ఒవైసీ ఇద్దరూ ఒకే ప్లేటులో బిర్యానీ తింటారు
  • నిర్ణయాలన్నీ దారుస్సలాంలోనే జరుగుతున్నాయి
హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో మజ్లిస్‌తో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పరోక్షంగా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయంటూ ఎన్నికల్లో తాము చేసిన ఆరోపణలు మేయర్ ఎన్నిక సందర్భంగా రుజువైందని అన్నారు.

తెలంగాణను వ్యతిరేకించిన పార్టీతో టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని పొత్తు పెట్టుకుందని  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఇద్దరూ ఒకే ప్లేట్‌లో బిర్యానీ తినే రకమని, ప్రజలు ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. నగరానికి సంబంధించిన నిర్ణయాలు దారుస్సలాంలో జరుగుతున్నాయని, కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలి? పోలీసులు ఎవరుండాలి? రెవెన్యూ అధికారులు ఎవరుండాలన్న నిర్ణయాలు కూడా అక్కడే జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
G. Kishan Reddy
KCR
Asaduddin Owaisi

More Telugu News