Pawan Kalyan: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ

Janasena chief Pawan Kalyan met union home minister Amit Shah
  • నిన్న ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్
  • పార్లమెంటు ఆవరణలో అమిత్ షాతో సమావేశం
  • పవన్ వెంట నాదెండ్ల మనోహర్
  • విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై విజ్ఞప్తి!
  • తిరుపతి లోక్ సభ అభ్యర్థిపైనా చర్చించే అవకాశం
ఏపీ తాజా పరిస్థితులను కేంద్రం పెద్దలకు వివరించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయడానికి పవన్ ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పార్లమెంటు ఆవరణలో భేటీ అయ్యారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపైనా వారు అమిత్ షాతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. తిరుపతిలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించారు. మరి ఆ అభ్యర్థి ఎవరన్నది బీజేపీ పెద్దలతో సమావేశాల అనంతరం తేలనుంది. పవన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసే అవకాశాలున్నాయి.
Pawan Kalyan
Amit Shah
Nadendla Manohar
Jana Reddy
New Delhi
Andhra Pradesh

More Telugu News