Vontari Narasareddy: వంద రోజులుగా సౌదీ అరేబియాలో నిజామాబాద్ వాసి మృతదేహం... హైకోర్టును ఆశ్రయించిన భార్య

Nizamabad woman approaches high court to repatriation of her husband dead body from Saudi Arabia
  • తెలంగాణ నుంచి సౌదీ వలసవెళ్లిన నరసారెడ్డి
  • గతేడాది నవంబరు 1న మృతి
  • పనిచేసే ప్రదేశంలో ప్రమాదంలో కన్నుమూత
  • ఇప్పటికీ సౌదీలోనే ఉన్న మృతదేహం
  • తల్లడిల్లిపోతున్న కుటుంబసభ్యులు
  • చివరిప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించిన వైనం

ఒంటరి నరసారెడ్డి అనే వ్యక్తి తెలంగాణలోని నిజామాబాద్ నుంచి సౌదీ అరేబియా వలస వెళ్లాడు. అయితే, 2020 నవంబరు 1న తాను పనిచేసే స్థలంలో జరిగిన ఓ ప్రమాదంలో నరసారెడ్డి కన్నుమూశాడు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు అతడి మృతదేహం సౌదీలోనే ఉంది. దాంతో తెలంగాణలోని అతడి కుటుంబీకుల వేదన వర్ణనాతీతం.

తన భర్త మృతదేహాన్ని సౌదీ అరేబియా నుంచి భారత్ కు తీసుకువచ్చేందు సాయం చేయాలంటూ నరసారెడ్డి భార్య లక్ష్మి కలవని వాళ్లు లేరు. విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులను కూడా ఆమె సంప్రదించింది. సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉన్న భారత ఎంబసీ అధికారులకు కూడా పలు విజ్ఞప్తులు చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించినా ఫలితం లేకపోయింది.

ఈ నేపథ్యంలో లక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త మృతదేహాన్ని సౌదీ అరేబియా నుంచి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును వేడుకుంది. ఆమె కోర్టును ఆశ్రయించడంలో ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ (పీఎంఎల్ యూ) సహకరించింది. కోర్టు నిర్ణయం కోసం ఆమె ఆశగా ఎదురుచూస్తోంది.

  • Loading...

More Telugu News