వైసీపీకి తోక పార్టీ కాదు.. షర్మిలనే మా సీఎం అభ్యర్థి: రాఘవరెడ్డి
- గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన రాఘవరెడ్డి
- ప్రస్తుతం షర్మిల వెనుక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైనం
- తమ సీఎం అభ్యర్థి షర్మిల అని వ్యాఖ్య
రాజశేఖరరెడ్డి హయాంలో పొత్తుల పంచాయతీ ఉండేది కాదని... ఇప్పుడు కూడా షర్మిల పార్టీకి పొత్తులు ఉండవని రాఘవరెడ్డి అన్నారు. తమ సీఎం అభ్యర్థిగా షర్మిలనే ఉంటారని చెప్పారు. మన దేశంలో 3,212 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఏకైన మహిళ షర్మిల అని అన్నారు. వైయస్ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. వైయస్ కుటుంబం కేసీఆర్ కుటుంబం వంటిది కాదని అన్నారు. అన్ని జిల్లాల నేతలతో వరుస సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. 30 రోజుల తర్వాత ఒక శుభ ముహూర్తాన పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తామని చెప్పారు.