బస్సులో 19 ఏళ్ల యువతిపై ఇద్దరి అత్యాచారం

Two men rapes a lady in Mumbai
  • నవీ ముంబైలోని ఖర్గార్ ప్రాంతంలో ఘటన
  • యువతికి మద్యం తాగించి అత్యాచారం
  • ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి ఒడిగట్టారు. నవీ ముంబైలోని ఖర్గార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరు డ్రైవర్ కాగా, మరొకరు పిజ్జా డెలివరీ బోయ్.

ఘటన వివరాల్లోకి వెళ్తే, బైక్ డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్పి సదరు యువతిని డ్రైవర్ తీసుకొచ్చాడు. తనతో పాటే మద్యం కూడా తీసుకొచ్చిన అతను... ఆమెకు బలవంతంగా మద్యం తాగించి బస్సులోనే అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన పిజ్చా డెలివరీ బోయ్ ని కూడా పిలిపించాడు.

పిజ్జా డెలివరీ బోయ్ కూడా ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆమెను బస్సులోనే వదిలి పారిపోయారు. మరుసటి రోజు ఈ దారుణంపై కుటుంబసభ్యులకు ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. పిజ్జా డెలివరీ బోయ్ ని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Mumbai
Rape

More Telugu News