India: ఛేజింగ్ లో టీమిండియాకు ఎదురుదెబ్బ... ఆరంభంలోనే రోహిత్ అవుట్

  • చెన్నై టెస్టులో భారత్ టార్గెట్ 420 రన్స్
  • వికెట్ నష్టానికి 39 పరుగులు చేసిన భారత్
  • రోహిత్ ను అవుట్ చేసిన లీచ్
  • ముగిసిన నాలుగో రోజు ఆట
  • క్రీజులో గిల్, పుజారా
India lost Rohit Sharma wicket in crucial chasing in Chennai test

చెన్నై టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. 420 పరుగుల లక్ష్యఛేదన కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట చివరికి 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బంతికి బౌల్డయ్యాడు. భారత్ గెలవాలంటే ఇంకా 381 పరుగులు అవసరం కాగా, చేతిలో 9 వికెట్లున్నాయి. శుభ్ మాన్ గిల్ (15), ఛటేశ్వర్ పుజారా (12) క్రీజులో ఉన్నారు.

భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్ల సహకారం ఎంతో అవసరం. ఆ లెక్కన చూస్తే రోహిత్ శర్మ ఆరంభంలోనే అవుట్ కావడం భారత్ కు విఘాతమేనని చెప్పాలి. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు సాధించాడు.

ఇక, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో లారెన్స్ వికెట్ తీసిన ఇషాంత్ శర్మ 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన భారత పేసర్లలో కపిల్ దేవ్ (434), జహీర్ ఖాన్ (311)ల తర్వాత ఇషాంత్ మూడో స్థానంలో నిలిచాడు. ఇషాంత్ శర్మ 98 టెస్టుల్లో ఈ ఘనత అందుకున్నాడు.

More Telugu News