విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న వైసీపీ నేతలు!
- విశాఖ బాలచెరువు రోడ్ వద్ద అఖిలపక్ష పార్టీల నిరసన
- పాల్గొన్న అవంతి, గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, ఎంవీవీ
- ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు తాము పోరాడుతామని స్పష్టం
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ ప్లాంట్‌ను కాపాడుకునేంత వరకు తాము పోరాడుతామని స్పష్టం చేశారు. దాన్ని దీర్ఘకాలం పాటు పోరాడి సాధించుకున్నామని గుర్తు చేశారు. ఆ ఉక్కు పరిశ్రమ కోసం అప్పట్లో 32 మంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోదీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు.