Rakesh Tikait: ఇది ప్రజా ఉద్యమం.. విఫలం కాదు: రైతు నేత రాకేశ్ తికాయత్

  • సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇళ్లకు వెళ్లం
  • పంట ఉత్పత్తులకు మద్దతు ధరపై కొత్త చట్టాన్ని చేయాలి
  • అరెస్ట్ చేసిన రైతు నేతలను విడుదల చేయాలి
No ghar wapsi till farmers demands are met

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ జరుగుతున్న ఆందోళన ప్రజా ఉద్యమమని, అది ఎప్పటికీ విఫలం కాదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. రైతులకు మేలు చేయని ఈ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని ఆపబోమని తేల్చి చెప్పారు.

 హరియాణాలోని చార్‌ఖీ దాద్రి సమీపంలో నిన్న నిర్వహించిన ‘కిసాన్ మహా పంచాయత్’ను ఉద్దేశించి రాకేశ్ తికాయత్ మాట్లాడారు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇచ్చేలా కొత్త చట్టాన్ని చేయడంతోపాటు ఇటీవల అరెస్ట్ చేసిన రైతు నేతలను విడుదల చేసే వరకు తాము ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాగా, హరియాణాకు చెందిన ఓ రైతు టిక్రి సరిహద్దులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

More Telugu News