ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఇద్దరు ఓపెనర్లూ ఔట్!
- తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 578 పరుగులు
- 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 59/2
ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులకే అర్చర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 29 పరుగులు చేశాక అర్చర్ బౌలింగ్‌లోనే అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(20), కోహ్లీ(4) ఉన్నారు. అతి తక్కువ పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో భారత బ్యాట్స్‌మెన్ పై ఒత్తిడి పడుతోంది. భోజన విరామం సమయానికి టీమిండియా స్కోరు 59/2గా ఉంది.