Arjun Rampal: పవన్, క్రిష్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు!

Arjun Rampal to play key role in Pawans role
  • క్రిష్ దర్శకత్వంలో పవన్ పిరీడ్ ఫిలిం 
  • కథానాయికలుగా నిధి, జాక్వెలిన్
  • ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్
  • పరిశీలనలో 'హరిహర వీరమల్లు' టైటిల్  

పవన్ కల్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. వీటిలో ఒకటి మలయాళం హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియమ్'కి రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే హైదరాబాదులో మొదలైంది. ఇక మరో చిత్రం క్రిష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న భారీ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ కూడా ఏకకాలంలో జరుగుతోంది.

ఇక ఇది మొఘలాయీల పాలన నాటి కాలంలో జరిగే చారిత్రాత్మక కథతో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో పవన్ వజ్రాలదొంగగా వెరైటీ పాత్రలో కనిపిస్తారట. ఇందులో కథానాయికలుగా నిధి అగర్వాల్.. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు.

ఈ చిత్రంలో కీలకమైన పాత్ర ఒకటి ఉందట. అదే మొఘలాయీ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర. ఈ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ పోషించనున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రానికి మొదటి నుంచీ రకరకాల టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. అయితే, తాజాగా 'హరిహర వీరమల్లు' అనే పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.  

  • Loading...

More Telugu News