రైతులకు మద్దతు తెలిపినందుకు చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి: బ్రిటన్ నటి
- ఇన్‌స్టాగ్రామ్‌లో జమీలా జమిల్ పోస్టు
- బెదిరింపులకు పాల్పడేవారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి
- భవిష్యత్తులోనూ మద్దతు తెలుపుతా
- న్యాయమైన హక్కుల కోసమే రైతులు పొరాడుతున్నారు
ఈ విషయాన్ని తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేసింది. కొన్ని నెలలుగా తాను తరచుగా భారతీయ రైతులకు మద్దతు తెలుపుతున్నానని ఆమె చెప్పింది. అయితే, ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, తనను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని చెప్పింది.
ఇటువంటి బెదిరింపులకు పాల్పడేవారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆమె కోరింది. తానూ మనిషినేనని, కొంతవరకే దేన్నయినా భరించగలనని తెలిపింది. భారత రైతులకు తాను సంఘీభావం తెలుపుతున్నానని, భవిష్యత్తులోనూ తెలుపుతానని స్పష్టం చేసింది. తమ న్యాయమైన హక్కుల కోసమే రైతులు పోరాడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని చెప్పింది.