Haryana: పెళ్లి శుభ‌లేఖ‌పై రైతుల ఉద్య‌మ నినాదాలు.. చోటురాం, భగత్‌సింగ్ ఫొటోలు

  • హరియాణా రైతు కుమారుడి పెళ్లి శుభ‌లేఖ వైర‌ల్
  • రైతులు లేకపోతే ఆహారం లేదని శుభ‌లేఖ‌పై నినాదం
  • రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు
Haryana farmers getting pro farmer slogans printed on wedding cards

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతోన్న విష‌యం తెలిసిందే. దేశంలోని ప‌లు ప్రాంతాల నుంచి వారి ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇదే స‌మ‌యంలో హరియాణాలో ఓ పెళ్లి శుభ‌లేఖ‌ను రైతుల ఉద్యమానికి మ‌ద్ద‌తు తెలిపేలా ముద్ర‌‌వేయించారు.  

రైతులు చేస్తున్న ఉద్యమానికి వినూత్న ప‌ద్ధ‌తిలో ఇలా ఖైతల్‌- దుంద్రేహీ గ్రామానికి చెందిన ప్రేమ్‌సింగ్‌ గోయత్ అనే రైతు శుభ‌లేఖ‌ను కొట్టించాడు. తన కుమారుడి వివాహ వేడుక‌కు అంద‌రూ రావాల‌ని, రైతుల ఉద్య‌మానికి కూడా మ‌ద్ద‌తు తెలపాల‌ని చెప్పాడు.

శుభ‌లేఖ‌పై రైతులు లేకపోతే ఆహారం లేదనే నినాదాన్ని ముద్రించాడు. అలాగే, ట్రాక్టర్‌పై రైతు ఉన్న చిత్రాలతో పాటు స్వాతంత్య్రం రాక‌ముందు రైతుల హక్కుల కోసం పోరాడిన నేత చోటురాం, బ్రిటిష‌ర్ల‌కు చుక్క‌లు చూపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన భగత్ ‌సింగ్‌ చిత్రాలను త‌న కుమారుడి పెళ్లి ప‌త్రిక‌లపై వేయించాడు.‌

More Telugu News