Salman Khan: రైతు ఉద్యమంపై బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ ఖాన్​ స్పందన!

Salman Khan speaks up on farmers protests
  • వారి కోసం ఏదైనా సరైనదే చేయాలని వ్యాఖ్య
  • అత్యంత గొప్పదే చేయాలని సూచన
  • మ్యూజిక్ రియాలిటీ షో ప్రారంభోత్సవంలో వ్యాఖ్య
సాగు చట్టాల రద్దు డిమాండ్ తో రైతులు చేస్తున్న ఆందోళనలు.. అంతర్జాతీయ సమాజాన్నీ తాకాయి. అంతర్జాతీయ ప్రముఖులు దానిపై స్పందిస్తున్నారు. ఇప్పటికే పాప్ సింగర్ రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ వంటి వారు రైతు ఉద్యమంపై ట్వీట్లు చేశారు. వారికి మన కేంద్ర ప్రభుత్వమూ గట్టిగానే సమాధానం చెప్పింది. ఇప్పుడు తాజాగా రైతుల ఆందోళనలపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా స్పందించాడు.

శుక్రవారం ముంబైలో మ్యూజిక్ రియాలిటీ షో ‘ఇండియన్ ప్రో మ్యూజిక్ లీగ్’ ప్రారంభోత్సవం సందర్భంగా సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రైతు ఉద్యమంపై స్పందనేంటని ఓ విలేకరి ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. రైతులకు సరైన న్యాయం చెయ్యాలన్నాడు. ‘‘రైతుల కోసం ఏదైనా సరైనదే చేయాలి. అత్యంత సరైన న్యాయం చేయాలి. వారి కోసం అత్యంత గొప్పదే చేయాలి’’ అని అన్నాడు. అయితే, దీనిపై ఇప్పటిదాకా షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్లు మాత్రం స్పందించలేదు. ఇక, ఇదే కార్యక్రమంలో సల్మాన్ ఓ పాట పాడి జోష్ నింపాడు.
Salman Khan
Farm Laws
Farmers Protests
Bollywood

More Telugu News