Telangana: సినీ ప్రేమికుల‌కు శుభ‌వార్త‌‌.. తెలంగాణ‌లోని థియేట‌ర్ల‌లో 100 శాతం ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి

Telangana government allows 100 pc seating capacity in cinemas
  • ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి
  • తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్   
కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఇప్పటివరకు 50 శాతం సామ‌ర్థ్యంతో మాత్ర‌మే తెలంగాణ‌లోని సినిమా థియేట‌ర్లు తెరుచుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే 100 శాతం సామ‌ర్థ్యంతో తెరుచుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు అనుమ‌తులు ఇచ్చిన నేప‌థ్యంలో ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఇందుకు సంబంధించి నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ‌లోనూ అన్ని థియేట‌ర్లూ 100 శాతం సామ‌ర్థ్యంతో తెరుచుకోవ‌చ్చ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. క‌రోనా విజృంభ‌ణ ఇంకా త‌గ్గ‌ని నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...  థియేట‌ర్ల‌లో ప‌రిశుభ్ర‌త‌, మాస్కులు పెట్టుకోవ‌డం వంటి జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.  
Telangana
Tollywood

More Telugu News