Local Body Polls: ఏపీ పంచాయతీ... తొలి విడతలో 523 సర్పంచ్ లు ఏకగ్రీవం! 

  • 9న తొలి విడత ఎన్నికలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 110 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
  • 1,323 నామినేషన్ల తిరస్కరణ
523 Sarpanch Polls Unanimous in AP First Phase Local Body Elections

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్లు రాగా, సర్పంచ్ పదవికి 19,491, వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిల్లో 523 సర్పంచ్ పదవులకు ఒకే ఒక్క నామినేషన్ చొప్పున దాఖలు కాగా, అవన్నీ ఏకగ్రీవం అయినట్టే. సర్పంచ్ పదవులకు సంబంధించిన నామినేషన్లలో 1,323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని పేర్కొన్నారు.

ఇక తొలి విడతలో ఎన్నికలు జరిగే 12 జిల్లాలను పరిశీలిస్తే, చిత్తూరులో అత్యధికంగా 110 సర్పంచ్ పదవులు ఏగ్రీవమయ్యాయి. ఇదే సమయంలో ఆ జిల్లాలో వార్డుల విషయంలో 2,499 వార్డులకు ఒకే నామినేషన్ చొప్పున దాఖలైంది. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఆరు పదవులే ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఏకగ్రీవం కాని పంచాయతీలు, వార్డులకు 9వ తేదీన పోలింగ్ జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News